బాల్య వివాహాలపై అవగాహన సదస్సు
--బాలల హక్కుల కమిషన్ సభ్యులు వీ.గాంధీ బాబు.
వీ.ఆర్.పురం, పెన్ పవర్
వీ.ఆర్.పురం మండలం రేఖపల్లి గ్రామం ఏ. ఎస్.డీ.ఎస్ ప్రాంగణంలో గురువారం బాలల హక్కుల కమిషన్ సభ్యులు వీ.గాంధీ బాబు అద్వర్యం బాల్యవివాహల గురించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషన్ సభ్యులు వీ.గాంధీ బాబు మాట్లాడుతూ గ్రామల్లో పనిచేయుచున్న వాలేంట్రీలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు గ్రామల్లో జరుగుతున్న బాల్యవివాహలపై శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు సమాచారా నివేదిక సమర్పించాలని ఆయన అన్నారు. వీ.ఆర్.పురం మండలం ఐ.సి.డీ.ఎస్ ప్రాజెక్ట్ అధికారి వై.పద్మావతి మాట్లాడుతూ శిసు మరణాలు, పిల్లలకు పోషకాహారం, గురించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని. గర్భిణి స్త్రీలకు మెరుగైన ఆహారం అందిచాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్.పి డి.ఓ శ్రీనివాస్ రావు, వీ.ఆర్.పురం ఎస్.ఐ వెంకట్, రెవెన్యూశాఖ, సూపరు వైజర్లు, సెక్రెటరులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment