Followers

  అక్రమంగా తెల్లరాయి తరలింపు


  అక్రమంగా తెల్లరాయి తరలింపు


 సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నయ్య పడాల్.


 


 చింతపల్లి , పెన్ పవర్


 

 ప్రపంచమంతా కరోనా వైరస్తో అతలాకుతలం అవుతుంటే మరో పక్క మైనింగ్ అక్రమార్కులు రెచ్చిపోయి తెల్లరాయి తరలిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని పెదబరడ పంచాయతీ లోని మడిగుంట,తెరపల్లి, రాజుపాకల గ్రామాలలో పర్యటించి కరోనా వైరస్ స్వీయ నిర్బంధ సమయంలో గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెరపల్లి గ్రామస్తులు మైనింగ్ వ్యాపారులు అక్రమంగా తెల్లరాయి (గ్రానైట్) తరలించుకుపోతున్నారని వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్  మాట్లాడుతూ గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో తెల్లరాయి, ఎర్ర మట్టి క్యారీలు బినామీల పేరిట మంజూరు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.1/70 చట్టం ప్రకారం ఈ క్వారీలు నిర్వహించకూడదని పలుమార్లు ఆందోళనలు చేపట్టి,అధికారులకు వినతి పత్రాల ద్వారా విన్నవించినా కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ క్వారీల తవ్వకాల వలన గ్రామం చుట్టు ప్రక్కల ఉన్న భూగర్భ జలాలు మొత్తం అడుగంటి పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా త్రాగే నీరు పూర్తిగా కలుషితమ వుతున్నాయన్నారు.ఈ నీటిని సేవించడం వలన విషజ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ తవ్వకాలు నిర్వహించడానికి అధికార పార్టీ నాయకులే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆందోళనలుచేసిన ప్రతిసారి అధికారులు, పాలకులు ఈ తవ్వకాలు రద్దు చేస్తామని ప్రజలకు మోసపూరిత ప్రకటనలు చేస్తూ ఈ క్వారీల ద్వారా నెలవారిమామ్ముళ్ళు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు.జీవో నెం 97 రద్దు చేసి ఉంటే గిరిజన ప్రాంతంలో ఉన్న మైనింగ్, గ్రానైట్ తవ్వకాలు నిలుపుదల చేసేవారని, జీవోనెం 97  అమలులో ఉండడం వల్లనే ఈ క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పే నేడు వైయస్సార్ కాంగ్రెస్  ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు.అక్రమంగా తరలిస్తున్న తెల్లరాయి క్యారీని వెంటనే రద్దు చేయకుంటే ఈ చుట్టుపక్కల గ్రామస్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్, మర్రి అప్పారావు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...