Followers

ఇకపై వినియోగదారులే రాజులు


ఇకపై వినియోగదారులే రాజులు.. అమలులోకి రానున్న కొత్త చట్టం..! 


(బ్యూరో రిపోర్ట్ విశాఖపట్నం, పెన్ పవర్ )



           భారతప్రభుత్వం ఇకపై నూతన వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తేనుంది. వచ్చే వారం.. అంటే జూలై 20వ తేదీ నుంచి ఈ కొత్త చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా వినియోగదారులకు తాము కొనే, పొందే వస్తువులు, సేవలకు పూర్తి హక్కులు ఉంటాయి. వారికి రక్షణ కల్పించబడుతుంది. ఈ మేరకు జూలై 20 నుంచి కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని అమలు చేయనున్నారు. కొత్త చట్టం అమలులోకి వస్తే వినియోగదారులే రాజులు అవుతారు. వినియోగదారులు ఇకపై తాము కొనే వస్తువులకు సంబంధించిన ప్రాంతంలో కాకుండా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వినియోగదారుల ఫోరంలో కేసులు వేసి ఆ మేరకు పరిహారం పొందవచ్చు. ఇక వినియోగదారులు వారు కొనే వస్తువుల వల్ల వారికి నష్టం కలిగితే ఆ వస్తువులను తయారు చేసిన కంపెనీ లేదా డీలర్ లేదా డిస్ట్రిబ్యూటర్ లేదా అమ్మకం దారులకు గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది.1 లక్ష ఫైన్ వేస్తారు. అయితే వినియోగదారులకు తాము కొనే వస్తువుల వల్ల గాయాలైతే తయారీదారు, అమ్మకందారు, డిస్ట్రిబ్యూటర్‌లకు గరిష్టంగా రూ.5 లక్షల ఫైన్ విధిస్తారు. లేదా 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇక ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులు చనిపోతే గరిష్టంగా రూ.10 లక్షల ఫైన్ పడుతుంది. 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. తీవ్రత ఎక్కువ ఉంటే యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధిస్తారు. నూతనంగా అమలు చేయనున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం ఈ శిక్షలు, ఫైన్లు ఉంటాయి. వినియోగదారులు తాము కొనే వస్తువులు నకిలీవని తేలినా, వాటిలో కల్తీ అని గుర్తించినా.. డ్యామేజ్ అయినా.. ఇతర ఏ కారణాల వల్ల అయినా నష్టం కలిగితే అందుకు పరిహారం పొందవచ్చు. ఇక ఒకే సారి ఎక్కువ మంది వినియోగదారులకు నష్టం వాటిల్లితే దాన్ని సుమోటోగా తీసుకుని జాతీయ వినియోగదారుల ఫోరం కేసు విచారించి.. బాధితులకు రక్షణ, పరిహారం అందిస్తుంది. కాగా కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 బిల్లును గతేడాదే అమోదించారు. మొదట దీన్ని జూలై 8, 2019లో రాజ్యసభలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ప్రవేశపెట్టగా, జూలై 30, 2019న లోక్‌సభలో ఈ బిల్లును ఆమోదించారు. తరువాత ఆగస్టు 6, 2019న రాజ్యసభ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 9, 2019న ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ఈ క్రమంలో ఈ బిల్లు జూలై 20, 2020 నుంచి అమలులోకి రానుంది. దీంతో ఇకపై వినియోగదారులకు తాము కొనుగోలు చేసే, పొందే వస్తువులు, సేవలకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుంది. కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వినియోగదారులకు 6 హక్కులను అందిస్తోంది..



1. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవలకు గాను వారికి పూర్తి స్థాయిలో రక్షణ హక్కు లభిస్తుంది.
2. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవలకు సంబంధించి క్వాలిటీ, క్వాంటిటీ, పొటెన్సీ, ప్యూరిటీ, స్టాండర్డ్‌, ధరలను తెలుసుకునే హక్కు ఉంటుంది.
3. అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసే, అన్ని రకాల సేవలను పొందే హక్కు, వాటిని ఎంపిక చేసుకునే హక్కులు వినియోగదారులకు ఉంటాయి.
4. వినియోగదారులు తమ ఫిర్యాదులను సంబంధిత ఫోరంలలో నమోదు చేసే హక్కు ఉంటుంది.
5. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవల వల్ల నష్టం వాటిల్లితే అందుకు పరిహారం పొందే హక్కు ఉంటుంది.
6. వినియోగదారులు తాము కొనే వస్తువులు, పొందే సేవలపై నష్టపోకుండా ఉండేందుకు వారు వివరాలను తెలుసుకునే హక్కు కూడా ఉంటుంది.
కాగా నూతన చట్టం గురించిన మరిన్ని వివరాలను ఒకటి, రెండు వారాల్లో ఓ నోటిఫికేషన్ రూపంలో తెలపనున్నారు. కానీ చట్టాన్ని మాత్రం జూలై 20 నంచి అమలు చేయనున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...