Followers

వేదాలు గురించి అందరూ తెలుసుకోవాలి


వేదాలు గురించి అందరూ తెలుసుకోవాలి

 

అనకాపల్లి , పెన్ పవర్

 

ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాస పురాణాలు తెలుసుకోవాలంటే వ్యాస మహర్షి బోధించిన వేదాలను తెలుసుకోవాలని హరే కృష్ణ మందిర అధ్యక్షులు దుర్గభ కృష్ణ  ప్రేమ దాస్ ప్రభూజీ అన్నారు. స్థానిక బిజెపి సీనియర్ కార్యాలయంలో కిషాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దుర్గభ కృష్ణ ప్రేమ్ దాస్ ప్రభుజి మాట్లాడుతూ వేదభూమి ,కర్మభూమి, జ్ఞానభూమిగా భారత్ విరాజిల్లుతుంది అన్నారు. గురువులకే గురువు అయినా వ్యాస మహర్షి జయంతిని గురుపౌర్ణమి గా జరుపుకోవడం అదృష్టం అన్నారు. తల్లిదండ్రులు, గురువులు, పరి పాలకులను భక్తిభావంతో కొలిచే దేశం భారతదేశం అన్నారు. ప్రేమ దాస్ ప్రభుజీ  చేతుల మీదుగా సీనియర్ పార్టీ కార్యకర్తలు  పి రాము ,లెక్కల నాయుడు, సన్యాసి దొర, సాంబమూర్తి రాజు, బలరాం పాత్రుడు లను శాలువాతో చిరు సత్కారం చేశారు. గురుపూజోత్సవం అనంతరం కృష్ణదాస్  గురువును  శ్రీ కృష్ణుడి చిత్రపటం అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి బి సాయిరాం, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగుపాం నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు పి. నాగేశ్వరరావు, వుడా రమేష్, నర్సింగ్ యాదవ్, అవతారం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...