కార్యదర్శులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు. ... ఎంపీడీవో
టంగుటూరు, పెన్ పవర్
మండల కేంద్రమైన టంగుటూరు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో కార్యదర్శులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీవో జమి ఉల్ల పాల్గొని ఆయన మాట్లాడుతూ జగనన్న పచ్చతోరణం, మనం మన పరిశుభ్రత, వైయస్సార్ భరోసా, సచివాలయంలో డిజిటల్ సర్వీసులు పై సమీక్ష పచ్చ తోరణం లాంటి పథకాలన్నీ ఈనెల 24వ తేదీన నిర్వహించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ప్రతి 200 మొక్కలకు ఒక వాచ్ మెన్ ను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో జరుగుతాయని కావున ప్రతి ఒక్క కార్యదర్శి శ్రద్ధతో గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన తెలిపారు. అలాగే మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన చేపట్టాలని పరిశుభ్రత పక్షోత్సవాలు లో భాగంగా మురికి కాలువ లో శుభ్రం చేయడం మరమ్మతులు చేయడం చెత్తకుప్పలు లేకుండా చూడడం మలవిసర్జన బహిరంగంగా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే కోవిడ్-19 కి సంబంధించి ప్రజలలో దూరం పాటించే విధంగా మాస్కులు ధరించడం చేతులు శుభ్రం చేసుకోవడం అత్యవసర పరిస్థితుల్లో నే బయటకు వెళ్ళే విధంగా ప్రజలను అవగాహన పరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో పనిచేసే కార్యదర్శుల పై మండల స్థాయి అధికారులు రెండు టీములు గా ఉంటారని ఎంపీడీవో, ఏ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ మరియు ఈవో ఆర్ డి, పి ఆర్ జె ఈ లు పర్యవేక్షణలో ఉంటారని ఆయన తెలిపారు. అంతేకాకుండా డిజిటల్ సర్వీసులు ఎప్పటికప్పుడు సచివాలయాల లో నమోదు చేస్తూ ఇచ్చిన గడువు లోపల చేయాలని అధికారులకు సూచనలిచ్చారు. వైయస్సార్ భరోసా కింద ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు బోర్లు, బావులు ప్రభుత్వం ద్వారా తీయించడం జరుగుతుందని అయితే ఈ పథకాలను గ్రామ సచివాలయం ద్వారా ఆన్లైన్ చేసుకొని పొందవచ్చని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో కార్యదర్శులు మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment