Followers

లాక్‌డౌనా...... జాంతా నై, గీంతా నై !


లాక్‌డౌనా...... జాంతా నై, గీంతా నై !



అధికారులు  ఉత్తర్వులిస్తే పాటించాలా !!



రోడ్ల వెంట క్యూ కట్టిన ప్రజనీకం



(పెన్‌పవర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌, ఒంగోలు )



జిల్లాలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్‌ విధించిన లాక్‌డౌన్‌ జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోనే విఫలమౌతుంది. లాక్‌డౌన్‌ నిబంధన లు  జనాలu బేఖాతరు చేస్తూ యధేచ్చగా రోడ్ల మీద ద్విచక్ర వాహనాల్లో సంచరిస్తున్నారు. ఇంట్లో ఖాళీగా  కూర్చోవడానికి బద్దకించి రోడ్లమీదకు షికారుగా రావడం సర్వసాధారణం అయ్యింది. నిబంధనలను ఉలంఘిస్తున్న వారికి అక్కడక్కడా పోలీసులు  జరిమానాలు విధిస్తున్నా కూడా జనం గుంపులు, గుంపులుగా గుమిగూడటం, కార్లు, బైకులతో బయటకు రావడం మాత్రం మానుకోవడం లేదు. జిల్లాలో లాక్‌డౌన్‌ కఠినంగా అములుచేస్తే కాని కేసులు అదుపులోకి రావని అధికారులు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నా రాకపోకలు నియంత్రించడంలో ఘోరంగా  వైఫల్యం  చెందారని స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నా, చితక వ్యాపారస్తులు  షాపు ముగించడం మినహా,  జనం రాకపోకపైన పెద్దగా దృష్టి సారించని పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా ద్విచక్ర వాహనాలు రద్దీని పరిశీలిస్తే అసలు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు లో ఉన్నాయా? అనే సందేహం కలగక మానదు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు ఇంతటి నిర్లక్ష్యం సరికాదని వైద్యులు చెబుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో కెసులు నమోదు అవుతుంటే మరింత జాగ్రత్తగా వుండాలని, లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలుపరచేందుకు ప్రజలు సహకరించాని అధికారులు కోరుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...