Followers

నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి


నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి.


  ప్రాజెక్ట్ కమీష్ నర్ మల్లికార్జునరావు.
         


మాకవరపాలెం పెన్ పవర్



రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సర్వ శిక్ష అభియాన్ సహాయ ప్రాజెక్టు కమిషనర్ పి.మల్లికార్జున రావు అధికారులను ఆదేశించారు. సోమవారం మాకవరపాలెం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన ఆయన, జరుగుతున్న పనులు పురోగతిని నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు పథకం కింద ఆయా పాఠశాలల అభివృద్ధికి గాను మాకవరపాలెం మండలానికి రూ.4.7 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల భవనాల మరమ్మతులు, ప్రహరీలు, తాగునీరు, విద్యుత్ సదుపాయం తదితర పనులు 90 శాతం మేరకు పూర్తయ్యాయని మిగిలిన పనులు జూలై చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టీవీ రమణ, ఎస్ శేషగిరిరావు, ఎన్.శ్రీరామూర్తి, ఎస్. సరితా దేవి తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...