నా కొడుకు ఆచూకీ తెలపండి.
కన్న తల్లి ఆవేదన.
ఏలేశ్వరం,పెన్ పవర్
నా కొడుకు ను ఆదివారం అర్ధరాత్రి పోలీసుల పేరుతో కొంతమంది దౌర్జన్యంగా మా ఇంట్లో ప్రవేశించి తీసుకు పోయారని కన్నతల్లి కన్నీటి పర్యంతం అవుతుంది. వివరాల్లోకి వెళితే ఏలేశ్వరంకు చెందిన జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పైలా సుభాష్ చంద్రబోస్ ను ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా బోస్ కుటుంబసభ్యులు సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బోస్ను అరెస్టు చేసిన తీరు పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో భార్యతో సహా తన బెడ్ రూములో నిద్రిస్తున్న సమయంలో పోలీసులు మూసివేసిన గేటు దూకి మూసివున్న తలుపులను తన్ని కొంతసేపు భయానక వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చినవారు పోలీసులా, బయటి వ్యక్తులా అని తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా బోసును సినీఫక్కీలో తరలించుకుపోయారు అని వాపోయారు. ప్రస్తుత కరోనా సమయంలో తమ కుమారుని ఎక్కడికీ తీసుకెళ్లారో తెలియదని బోస్ తల్లి, తండ్రి ఏలేశ్వరం మాజీ వైస్ చైర్మన్ ఫైల సత్యనారాయణ భార్య, కుమారుడు, సోదరుడు ప్రతాప్ విలేకరుల సమావేశంలో బోరున విలపించారు.
No comments:
Post a Comment