Followers

రెండుకు చేరిన మృతుల సంఖ్య


విశాఖ సాల్వెంట్ ఫార్మా ప్రమాదంలో గాయపడిన మల్లేష్  చికిత్స పొందుతూ మృతి.


రెండుకు చేరిన మృతుల సంఖ్య.


          పరవాడ పెన్ పవర్


పరవాడ: జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ  విశాఖ సాల్వెంట్ ఫార్మా కంపెనీ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేష్ అనే ఉద్యోగి గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ కంపెనీ లో మృతి చెందిన ఉద్యోగుల సంఖ్య రెండుకు చేరింది. నాటి ప్రమాదంలో అనకాపల్లి మండలం రేబాక ప్రాంతానికి చెందిన సీనియర్ కెమిస్ట్రీ కాండ్రేగుల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ప్రమాదంలో మల్లేష్ తో పాటు మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన మల్లేష్ కుటుంబానికి రూ" కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే నాటి ప్రమాదంలో మృతి చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావుకు కంపెనీ యాజమాన్యం రూ"50 లక్షల పరిహారం ప్రకటించారు. కాగా విశాఖ సాల్వెంట్ ప్రమాదంపై పోలీస్ శాఖ కేసు నమోదు చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...