కరోనా ఫీవర్ మండపేటను పట్టి పీడిస్తోంది
మండపేట, పెన్ పవర్
ప్రస్తుతం కరోనా ఫీవర్ మండపేటను పట్టి పీడిస్తోంది. ఒకే రోజు మొత్తం 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ కార్యాలయంలో ఒకరు, హౌసింగ్ కార్యాలయంలో మరొకరు ఈ వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా చూసుకుంటే 26వ వార్డులో మూడు కేసులు, గొల్లపుంత కాలనీలో మరో మూడు, 14వ వార్డులోని కుక్కల వారి వీధిలో ఒకటి, 11వ వార్డు న్యూ కొలనీలో ఇంకొకటి, రజక పేటలో ఒకటి, శ్రీనగర్ మొదటి వీధిలో మరొకటి, ఆలమూరు రోడ్డులో ఒకటి, కొండపల్లి వారి వీధిలో మారొకటి, ఏడిద రోడ్డులోని పేరంటాలమ్మ గుడి వద్ద ఇంకొకటి, విజయలక్ష్మి నగర్ లో మరొకటి నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా పారిశుధ్య కార్మికులకు రెట్టింపు పని భారం పడింది. మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ఆదేశాలు మేరకు ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బంది పట్టణం లో ప్రత్యేక శానిటేషన్ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఒకరికి కరోనా రావడంతో అధికారులు కార్యాలయాన్ని ఖాళీ చేశారు. హైపో క్లోరైడ్ ద్రావణం తో కార్యాలయాన్ని సానిటైజ్ చేశారు. ప్రస్తుతం కార్యాలయం కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి రావడంతో కొద్దీ రోజులు పాటు మూసివేయనున్నారు.
No comments:
Post a Comment