ఫార్మా పరిశ్రమల ప్రమాదాల వెనుక కుట్ర కోణం
చంద్రబాబు పాత్రపై అనుమానాలు విశాఖ ఇమేజ్ దెబ్బతీసేందుకే కుట్రలు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
పూర్ణా మార్కెట్ ,పెన్ పవర్.
విశాఖపట్నంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై తమకు అనుమానాలున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్రలు పాల్పడుతున్నట్టు భావిస్తున్నామన్నారు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఒక చంద్రబాబునాయుడు మాత్రమే చేయగలరని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తాను వ్యక్తిగతంగా కోరుతున్నానని చెప్పారు. జరుగుతున్న ఘటనలు, ప్రతిపక్షాల తీరు చూసి ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నారు. భోపాల్ గ్యాస్ ప్రమాద బాధితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో డబ్బులు అందలేదని, కానీ ఎల్జి పాలిమర్స్ బాధితులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు. విశాఖను జగన్ పరిపాలన రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనలకు అడ్డుకట్ట వేయడానికి ఇవన్నీ చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే, ఒకే రకమైన ప్రమాదాలు జరగడం పట్ల అనుమానాలు బలపడుతున్నాయి అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యారని, రాజధాని అమరావతి భూముల విషయంలోనూ ఎన్నో కుట్రలకు పాల్పడ్డారని అన్నారు. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలోనూ రైలు ను తగలబెట్టడం నికి కారణం అయ్యారని ఇప్పుడు అమరావతిలో ఆయన పెట్టుబడులు ఆస్తులు కాపాడుకోవడానికి విశాఖ ఏమైనా పర్వాలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రచారం చేసి లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజ మెత్తారు. గోదావరి పుష్కరాలు లో ఎంతో మంది చనిపోతే కుంభమేళాలో చనిపోవడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు అని,ఇప్పుడు ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయి శవాల మీద రాజకీయాలు చేయాలని ఎదురుచూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని, ఎప్పుడైనా దానికి కారణమైన వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని ప్రశ్నించారు. ఎల్జి పాలిమర్స్ సంఘటనలో నిందితుల విదేశీ వారైనా మంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితుల పక్షాన నిలబడి ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని అభినందించే స్థితిలో చంద్రబాబు లేరని పేర్కొన్నారు.జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ప్రభుత్వంలో ప్రజలందరూ మేలు పొందుతున్నారని పేర్కొన్నారు.
No comments:
Post a Comment