ప్రతి ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాయాలి
వి.ఆర్.పురం. పెన్ పవర్:
వి.ఆర్.పురం మండలంలోని ఇటీవల ఆర్ అండ్ ఆర్ సర్వే మండల అధికారులు నిర్వహించినారు. జీడిగుప్ప పంచాయితీ తుమ్మిలేరు పంచాయతీ గ్రామాలైన కొల్లూరు, గొందూరు, పోచవరం, ఇప్పూరు, కోటారిగొమ్ము, ములకపల్లి, ముత్యాలమ్మ గండి, రాయిగూడెం, జీడిగుప్ప, ఇసునూరు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను పెన్ పవర్ విలేకరి పలకరించగా 60 సంవత్సరాలనుంచి ఇక్కడే ఈ గ్రామాల్లోనే జీవిస్తున్నాము. కానీ గ్రామానికి పది మంది చొప్పున ఆర్ అండ్ ఆర్ సర్వే రాయలేదు. మాకు ఆధార్ కార్డ్, ఓటు గుర్తింపు కార్డ్ ఉన్నాయి. మా తల్లిదండ్రుల రేషన్ కార్డ్ లలో మా పేర్లు కూడా ఉన్నాయి. వివాహాలు కూడా అయినాయి కొత్త కార్డుల కొరకు అప్లై చేసుకున్నాము. 2016వ సంవత్సరంలో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు వచ్చి ఇండ్ల సర్వే నిర్వహించినారు. అప్పుడు 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ రాసినారు. అందులో కొంతమంది పేర్లు రాలేదు. కొన్ని గ్రామాలకు రహదారులు లేకపోవడంతో అక్కడ యువకులు హైదరాబాద్ కు కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళినారు. పనులు ముగించుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినారు. అలాంటి వారికి ఆర్ అండ్ ఆర్ సర్వే చేయలేదు. మీరు ఉద్యోగాలు చేస్తున్నారని అధికారులు అన్నారు. మేము పనుల నిమిత్తం వెళ్లినాము మరల ఇక్కడికి తిరిగి వచ్చినాము అన్నా అధికారులు పట్టించుకోలేదు. ఆర్ అండ్ ఆర్ సర్వే ని నిర్వహించేప్పుడు గ్రామ వాలంట్రీ గ్రామ పేద్దలను అడగాలి. వీరు ఇక్కడే జీవిస్తున్నారా, వీరికి ఇల్లు ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి. అలా చేయకుండా మీ పేరు లేదు మేము ప్యాకేజీ రాయటం వీలు పడదని అధికారులు అన్నారు. గ్రామ ప్రజలు మాత్రం గ్రామాల్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ రావాలని మీడియాకి తెలిపారు. ఇకనైనా ఐ.టి.డి.ఎ. అధికారులు స్పందించి మాకు ఆర్ అండ్ ఆర్ సర్వే చేసి ప్యాకేజీ ఇప్పించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment