Followers

రాజు గృహంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు


రాజు గృహంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు


జగ్గంపేట,  ( పెన్ పవర్ ప్రతినిధి):


ముంబాయి దాదర్ లోని రాజు గృహంపై డాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తు క నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం స్థానిక  సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో  జరిగిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరావు మాట్లాడుతూ రాజ గృహంపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని అలాగే గృహం పై దాడిని న్యాయస్థానాలు సుమోటోగా తీసుకొని విచారించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే వసతి గృహ సంక్షేమ అధికారి పెట్ట ప్రభాకర్ మాట్లాడుతూ రాజు గృహంపై దాడి భారత దేశం పై జరిగిన దాడిగా భావించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క జ్ఞాపకాలను పదిల పరిచిన రాజ గృహం పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఇండియన్ మిషన్ కాకినాడ పార్లమెంటు కన్వీనర్ సాదే నరేంద్ర మాట్లాడుతూ ఈ దాడి అత్యంత హేయమైన చర్య అని పిరికిపంద చర్య అని దాడికి పాల్పడిన వారిని వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో దిరిసాలపండు, లాజరు, తలారి రాజకుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...