సాధువుపై దాడి చేసి సొమ్ముతో పరార్..!
మోటారు సైకిల్ స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ.
సామర్లకోట, పెన్ పవర్
సామర్లకోట అతి పురాతన దేవాలయమైన శ్రీ మండవ్య నారాయణస్వామి ఆలయం వద్ద ఒక సాధువు పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి అతని సంచిలోని సొమ్ముతో పరారయ్యాడు. ఈ ఘటనలో గాయపడిన సాధువు తేరుకుని పోలీసులకు పిర్యాదు చేసారు. దానితో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారించారు.ఆలయం వద్ద ఉంటున్న సాధువు అందించిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి మోటారు సైకిల్ పై వచ్చి కర్రతో తలపై కొట్టి గాయపరచి అతని సంచిలోని నగదు తీసుకుని పరారయ్యాడు. దాడిలో సాధువు తలకు రక్తపు గాయం కాగా అతడు తేరుకునే లోపు నిందితుడు అక్కడ నుంచి తపించుకునే ప్రయత్నం లో అతని మోటారు సైకిల్ ను వదిలి పరారైనట్టు బాధితుడు పోలీసులకు పిర్యాదు చేసారు. కాగా నిందితుడు వదిలి పెట్టిన మోటారు సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా అతని ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment