Followers

అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి


 


అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి

 

పశువులుతో వెళ్ళి  అదృశ్యమైన బాలుడు

 

వారం తరువాత శవమై కనిపించాడు

 

సిరసపల్లిలో అలుముకున్న విషాద ఛాయలు

 

 పెదబయలు/విశాఖపట్నం బ్యూరో (పెన్ పవర్)

 

పశువులు తోలుకు వెళ్ళి న బాలుడు ఆరు రోజుల తరువాత శవమై కనిపించాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.పెదబయలు మండలం సిరసపల్లి గ్రామానికి చెందిన కృష్ణ రావు ఒక్కగానొక్క కుమారుడు రోహిత్ కుమార్ (13) గత ఆదివారం పశువుల కాపలకు  వెళ్లాడు. సాయంత్రం అయిన ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి తండ్రులు వెతికారు.అయినా ఫలితం లేదు.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న  రోహిత్ కుమార్ కనిపించక తల్లిదండ్రులు వారం రోజులు నిద్ర ఆహారం లేక శోకసంద్రంలో పడిపోయారు.పాడేరు గాలింపు చర్యలు నిమిత్తం ఈరోజు ఉదయం అటు వైపు వెళ్లిన పలువురికి దుర్వాసన రావడంతో దగ్గరకు వెళ్లి చూడగా చెట్టు కొమ్మపై బాలుడి మృతదేహం వేలాడుతుంది. తక్షణమే సమాచారం అందుకున్న తండ్రి మృతదేహాన్ని పరిశీలించి శవం తన కుమారునిదే అని గుర్తించాడు.ఈ సంఘటన పై తండ్రి కృష్ణారావు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు .ఆదివారం తన కుమారుడు తో పసుపుల ఆనందరావు, చిట్టపులి భూపతి పడల్, కుంటూరు బొజ్జయ్య, వెచంగి హేమంత్ కుమార్ లు కలసి  పశువులకాపాలకు వెళ్ళారని కానీ రోహిత్ మాత్రం తిరిగి రాలేదని చెప్పారు. సాయంత్రం 7గంటలకు సెల్ఫోన్ ఎక్కడో పడిపోయిందని  ఆ నలుగురు తన వద్దకు వచ్చారని తెలిపారు. మరలా నాలుగు రోజుల తర్వాత పోయిన సెల్ ఫోన్ వారే తెచ్చారు అని తెలిపారు. గత కొన్నాళ్లుగా కుటుంబీకులతో తగాదాలు ఉన్నాయని దానితో వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.... ఈ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని తండ్రి కోరుతున్నారు.... ఈ విషయంపై పెదబయలు ఏఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు .పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగిస్తామని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...