కరోనా నియంత్రణ ప్రభుత్వ వైఫల్యం
చింతపల్లి , పెన్ పవర్
కరోనా వైరస్ ప్రపంచాన్ని ముంచెత్తి, మృత్యువు విలయతాండవం చేస్తుంటే నిస్సహాయ పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాంగి ధనుంజయ్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ స్వీయ నిర్బంధం (లాక్ డౌన్) తరువాత మైదాన ప్రాంతీయులు జోరుగా ఏజెన్సీలో కలియ తిరగడంతో కరోనా విస్తరిస్తుందన్నారు. ఈ పరిస్థితిని కట్టడి చేయవలసిన ప్రభుత్వ యంత్రాంగం ఏ మాత్రం ఆ దిశగా చొరవ చూపడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైదాన ప్రాంత వ్యాపారస్తుల వలన శరవేగంగా మన్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృశ్య స్వచ్చందంగా మన్య ప్రాంత వాసులు స్వీయ నిర్బంధం పాటిస్తూ, వారపు సంతలు రద్దు చేసి, మైదాన ప్రాంత వ్యాపారులను మన్యంలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటుంటే పోలీసులు మన్య వాసులను భయపెట్టి మైదాన ప్రాంత వ్యాపారులను ఆహ్వానిస్తున్నారని ఇది ప్రజా వ్యతిరేక చర్య అని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే చేతులెత్తేయడం అంటే అంతకంటే దయనీయమైన పరిస్థితి మరొకటి లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం పునరాలోచించి ప్రతి మారుమూల గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పించి గిరిజనుల్లో మనోధైర్యాన్ని కలిగించాలని ఆయన కోరారు.

No comments:
Post a Comment