Followers

అంబెడ్కర్ నివాసం పై దాడి...రాజ్యాంగం పై జరిగినట్టే  



అంబెడ్కర్ నివాసం పై దాడి...రాజ్యాంగం పై జరిగినట్టే  
 


మాదిగ జేఏసీ  రాష్ట్ర ప్రచార కార్యదర్శి. గద్దల.నాగేశ్వరరావు


 అశ్వాపురం, పెన్ పవర్



   ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య 
దేశమైన భారతదేశానికి చెక్కుచెదరని రాజ్యాంగాన్ని అందించి ఈ దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు తెలిసేలా 
కృషిచేసిన మహనీయుడు 
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.అని మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల. నాగేశ్వరరావు అన్నారు..శనివారం నాడు మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డా.పిడమర్తి.రవి పిలుపు మేరకు..ముంబాయి లో అంబెడ్కర్ నివాసం  (రాజగృహపై)దాడి చేసిన దానికి నిరసనగా అంబెడ్కర్ విగ్రహాల దగ్గర నిరసన దీక్షకు పిలుపు నివ్వడం జరిగింది...ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ఆ మహనీయుడు ఎంతో ఇష్టంతో నిర్మించిన "రాజ గృహ" ఇంటిపై దుండగులు దాడి చేయడం అంటే 
అది రాజ్యాంగం మీద దాడి చేయడమే.అని అన్నారు..అలాగే
ఆ మహనీయుడి ఇంటిపై దుండగులు దాడి చేయడం అంటే మన అందరి ఇంటి పైన దాడి చేసినట్లే.అని అన్నారు..
 మహా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి  తక్షణమే "రాజ గృహ"పై దాడిని దేశద్రోహం కింద సుమోటోగా స్వీకరించి అలాగే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను శిక్షించాలి అన్నారు. 
 ప్రత్యేక పోలీసు బలగాలతో
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 
గారు నిర్మించిన రాజ గృహానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి. అని డిమాండ్ చేశారు.
ఇలాంటి దాడులు 
పునరావృతం కాకుండా తగు చర్యలు 
తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని  
డిమాండ్ చేస్తున్నాము..ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నియోజక వర్గ నాయుకులు మేకల.అంజిబాబు-అలవాల. కార్తిక్-ఇరుగు.కృష్ణతేజ-వెంకట్-జయశ్రీ-మానస-తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...