గూటాలలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు
పోలవరం, పెన్ పవర్
పోలవరం మండలం గూటాల పంచాయతీ పరిధిలో వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని మెయిన్ సెంటర్, బస్ షెల్టర్ , రైతు భరోసా కేంద్రం నందు గల దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సొసైటీ అధ్యక్షులు సుంకర అంజి బాబు, యువజన నాయకుడు సుంకర కొండబాబు, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ డేగపాటి హరి రామ కృష్ణ, డాక్టర్ శ్రీనివాసు లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అమలు చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు అని సొసైటీీ అధ్యక్షులు సుంకర అంజిబాబు అన్నారు . తండ్రిి బాటలోనే నడుస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు.
No comments:
Post a Comment