ఆపరేషన్ ముస్కాన్ తో బాల బాలికలకు మహర్దశ
పెన్ పవర్, కందుకూరు
ఆర్ సి ఇన్ ఛార్జి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వీధి బాలల సంరక్షణకు జిల్లా పోలీసు శాఖ ఆదేశాలమేరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని కందుకూరు సీ ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై కొత్తపల్లి.అంకమ్మ చేపట్టారు.కందుకూరు వ్యవసాయ మార్కెట్ పక్కన నివాసము ఉంటున్న సంచార జాతులు పిల్లలు చదువుకోకుండా,దినసరి వేతనంకు వెళుతున్న వారిని ఈరోజు ముస్కాన్ ఆపరేషన్ లో గుర్తించారు. ఈ సందర్భంగా కందుకూరు ఎస్సై కొత్తపల్లి అంకమ్మ మాట్లాడుతూ 14 సంవత్సరాలు లోబడి విద్యకు దూరంగా ఉంటున్న బాల బాలికలను గుర్తించడం ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమని, పేదరికం కారణంగా వివిధ కర్మాగారాలు, వర్తక, వాణిజ్య కేంద్రాల్లో పని చేస్తున్న బాల కార్మికులు, రోడ్ల మీద భిక్షాటన చేసే బాలలను గుర్తించి వారందరినీ ప్రభుత్వపరంగా, వారికి విద్యాబుద్ధులు నేర్పుతామన్నారు. ప్రతి ఒక్క బాల బాలిక చదువుకోవాలన్నదే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమన్నారు.అనంతరం వారికి మాస్కులు బిస్కెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై అంకమ్మ తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment