ఏంజెల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు, వితంతువులకు నిత్యావసరాలు పంపిణీ....
ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసీ చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్...
ఆలమూరు,పెన్ పవర్
ఆలమూరు మండలంలోని మూలస్థానం అగ్రహారం గ్రామంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆ గ్రామంలో కొన్ని ప్రాంతాలను "రెడ్‌జోన్" "కంటైన్మెంట్"జోన్ లుగా ప్రకటించడంతో ఆ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వృద్ధులకు, వితంతువులకు ఏంజెల్స్ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక హీలింగ్ ప్రేయర్ టవర్ ఆవరణలో మోసెస్ కిరణ్, మాధుర్య ఏంజెల్ దంపతుల సహకారంతో సమకూర్చిన బియ్యం, కోడి గుడ్లు, నిత్యవసర వస్తువులను ఏఎంసి చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఏంజెల్స్ హోప్ పౌండేషన్ ద్వారా మోసెస్ కిరణ్ దంపతులు అందిస్తున్న సహాయం చాలా అభినందనీయమన్నారు. అనంతరం ఏఎంసి చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్ దంపతులను అలాగే ఏఎంసి డైరెక్టర్ సురేఖ గణేష్ దంపతులను ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, నాండ్ర నాగమోహన్ రెడ్డి, పామర్తి శ్రీనివాస్, ఉప్పులూరి సత్తిపండు, గంగారావు, మూరా సత్యానందం, మూరా సత్యనారాయణ, కర్రీ సత్తిబాబు, అరిగెల బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment