హరిత విప్లవం ద్వారా వాతావరణ సమతుల్యత సాధ్యం
మొక్కలలో నిధుల స్వాహా కు స్వస్తి
85 శాతం మొక్కలు బతికి తేనే బిల్లుల చెల్లింపు
పేదల గృహాలు పచ్చటి వాతావరణంతో పులకరింపు
ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి
పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ చార్జి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుందని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. గురువారం దూబగుంట సమీపంలోని పొగాకు బోర్డు ఎదురుగా ఉన్న పేదల నివేశన స్థలం లో అధికారులతో కలిసి మహీధర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్న మంచి లేఅవుట్లో ఈ బృహత్తర కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అనేక సంవత్సరాల నుండి పచ్చదనం కార్యక్రమం దశాబ్దాల కాలం నుండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిగినప్పటికీ ఆ మొక్కలు ఇప్పటికీ ఎక్కడా కనబడటం లేదని అన్నారు. మొక్కల పెంపకం లో చేతి వాటం చూపి నిధులను స్వాహా చేశారని అన్నారు. ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 85 శాతం మొక్కలు బ్రతికితే బిల్లు చెల్లించే విధంగా అధికారులకు ఆదేశాలు అందాయని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం ఎంత ఉత్సాహంగా చేశారో అంతే ఉత్సాహంగా మొక్కలు బ్రతికే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని వీటిపై ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. హరిత విప్లవం ద్వారా వాతావరణంలో వచ్చే మార్పులను సమతుల్యం చేసే శక్తి చెట్లకు మాత్రమే ఉందని అన్నారు. అంతేకాకుండా వర్షపాతం బాగా పడడానికి ఇవి బాగా ఉపయోగపడతాయని అన్నారు. అంతేకాక పచ్చదనం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం సచివాలయం అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణంగా నిధులు స్వాహా చేసే కార్యక్రమానికి స్వస్తి పలికి పేదల కలలు కన్న గృహ నిర్మాణ సముదాయాలలో పచ్చతోరణం కింద ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి తీవ్ర కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అందరి సహకారంతో ఊహించిన దాని కంటే అదనంగా మొక్కలన్నీ బ్రతికే విధంగా చూసి కందుకూరు నియోజకవర్గం ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. మొక్కలు నాటడమే కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి వాటిని కాపాడాలని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లో భిన్నమైన రూపకల్పనకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఆర్డీవో ఓబులేసు మాట్లాడుతూ ఇన్ని రోజులు ఇంత అందమైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడి పేదల గృహాలకు ఇవ్వడం సంతోషకరమన్నారు. ఈ మొక్కలు అన్ని కాపాడి కాలనీ ని అందంగా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసిల్దార్ శ్రీనివాస రావు, ఏ ఈ గుళ్ళా లోకేష్, వైసీపీ నాయకులు పబ్బిశెట్టి శివ, జాజుల కోటేశ్వరరావు, చక్కా వెంకట కేశవరావు, పల్నాటి చెన్నయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment