Followers

ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలి


ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలి


చింతపల్లి ,  పెన్ పవర్


పాడేరు డివిజన్ పరిధిలోని అన్ని ఏజెన్సీ మండల కేంద్రాల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఏజెన్సీ మండలాల్లో ఆధార్ సెంటర్లు లేకపోవడంతో ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, చిన్న పిల్లలకు ఆధార్ నమోదు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. చింతపల్లి, జి.కె.వీధి, కొయ్యూరు మండలాల్లో ఆధార్ సెంటర్లు లేకపోవడంతో సుమారు 70 కి.మీ. దూరంలో ఉన్న నర్సీపట్నం ఆధార్ సెంటర్ కి వెళ్ళవలసి వస్తుందని, అక్కడ ఆధార్ సెంటర్ ఖాళీ లేకపోతే మరుసటి రోజు వెళ్లడమో లేకుంటే నర్సీపట్నం నకు మరికొంత దూరంలోనున్న రోలుగుంట మండల కేంద్రానికి వెళ్ళడమో చేయవలసి వస్తుందని ఆయా మండలాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తమ మండలాల పరిధిలో ఉన్న ఆధార్ సెంటర్ లకు వెళ్లడానికే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారమని,ఇప్పుడు సొంత మండలాల్లో ఆధార్ సెంటర్లు లేకపోవడంతో ఆర్థికభారం,శ్రమ అయినప్పటికీ నర్సీపట్నం లేదా రోలుగుంట ఆధార్ సెంటర్ కి వెళ్లక తప్పలేదంటున్నారు. వ్యవసాయ, కూలి పనులు మానుకొని వెళ్ళవలసి వస్తుందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ మండలాల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని గిరిజనులు కోరుతున్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...