క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ లారీలకు గ్రీజు కొట్టే కార్మికులకు మాస్కులు శానిటైజర్ పంపిణీ......
జగ్గంపేట పెన్ పవర్
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో టోల్గేట్ ఏర్పడిన దగ్గరినుండి పనిచేస్తున్న కొంత మంది కార్మికులు ఉన్నారు నేషనల్ హైవే మీదుగా వెళ్లిపోయే లారీలకు గ్రీజు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులకు కు క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండర్ జుత్తు క నాగేశ్వరరావు సహకారంతో జగ్గంపేట మండలం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో లో వారి చేతుల మీదుగా అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి మాస్కులు శానిటైజర్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఎమ్ డి కె ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దిరిశాల పండు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి విపరీతంగా విరిగిపోతుంది దాని నుండి మనం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాస్ కులను వాడాలని అలాగే శానిటైజర్ వాడాలని అలాగే సామాజిక దూరం పాటిస్తూ తమ జీవన విధానాన్ని కొనసాగించాలని అన్నారు అలాగే ఎ ఎం డి కే ఎస్ ప్రధాన కార్యదర్శి గోర్తా లాజర్ మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ ఈ కరోనా యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఉండాలని మనకు మనమే ఈ కరోనా వైరస్ నుండిమనకు మనమే కాపాడుకుంటూ ఇతరులను కాపాడాలని ప్రతి ఒక్కరూ అవసరమైనప్పుడు బయటకు రావాలని అంతేగాని చిన్నచిన్న అవసరాలకు బయటకు రాకుండా చూసుకోవాలని అలాగే పిల్లలను బయటకు రాకుండా కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లో క్రిస్టఫర్. లోవరాజు .యు. మరిడమ్మ .రాఘవ .సూర్యం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment