దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు
.........మండలం మాలమహానాడు అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ
గోకవరం పెన్ పవర్
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కోరుకొండ పోలీస్ డివిజన్ పరిధిలో దళితులపై దాడులు రోజురోజుకు ఎక్కువ వుతున్నాయి. దీనంతటికీ పోలీసులు పూర్తి బాధ్యత వహించాలి అని గోకవరం మండలం మాలమహానాడు అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ అన్నారు. గోకవరం లో మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాజమహేంద్రవరం పోలీస్ అర్బన్ జిల్లా కోరుకొండ డి.ఎస్.పి పరిధిలో ఉన్న సీతానగరం, కోరుకొండ, గోకవరం మండలం లో దళితులపై దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి అన్నారు. దీనంతటికీ ఆయా పోలీసులు దళితులను చులకన భావంతో చూడటం కారణ మని దీనికి సీతానగరం పోలీసులు ముని కోడలికి చెందిన దళిత యువకుడిని అగ్రవర్ణాల పై ఫిర్యాదు చేశాడని నెపంతో పోలీస్ స్టేషన్కు పిలిపించి విచక్షణా రహితంగా కొట్టి శిరోముండనం చేయడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.పోలీసులు సక్రమంగా సకాలంలో స్పందించక పోవడం దళితులపై పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పడానికి కూడా ఇది ఉదాహరణగా ఉందని మండల మాల మహానాడు అధ్యక్షులు రామకృష్ణ అన్నారు, పోలీస్ వ్యవస్థ దళితుల పట్ల వివక్ష చూపించడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు, కోరుకొండ డివిజన్ పరిధి లో దళితులపై జరుగు తున్న దాడులను అరికట్టేందుకు చర్యలు చేపట్ట కుండా నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
No comments:
Post a Comment