శ్రీ కుంకుళ్లమ్మ తల్లి కుంకుమార్చన
ద్వారకాతిరుమల,పెన్ పవర్
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల
ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న వెంకన్న స్వామి వారి దత్తత దేవాలయమైన శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో మొదటి శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో ఆర్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు.అయితే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తుల రద్దీతో కలకలలాడే ఆలయం కరోనా వైరస్ కారణంగా భక్తులు లేక వెల వెల బోతుంది శ్రావణ శుక్రవారం రోజున కుంకుమ పూజ చేయించుకునేందుకు ప్రతి సంవత్సరం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు కరోనా మహమ్మారి విజృంభించడంతో భక్తులు భయపడి ఆలయాలకి రావటం లేదు అయితే దేవాలయ అధికారులు వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా శానిటైజర్ ధర్మల్ స్కానింగ్ సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.
No comments:
Post a Comment