Followers

రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం. ఎమ్మెల్యే పర్వత



రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం. ఎమ్మెల్యే పర్వత

 

 ఏలేశ్వరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి  ప్రతి నిరుపేదకు విద్య ,వైద్యం, సొంతిల్లు అందాలని కన్న కలలు జగన్ ద్వారా సాధ్యమవుతుందని ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. మండల పరిధి పెద్దనాపల్లి గ్రామంలో రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నూతనంగా నిర్మించిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సచివాలయం నిర్మాణ పనులతో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువాడు ఉన్నంత వరకూ రాజశేఖర్ రెడ్డిని మరువలేము అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గొల్లపల్లి బుజ్జి, బది రెడ్డి గోవింద్, గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, బుద్ధ ఈశ్వరరావు, ఎంపీడీవో డిఎన్ రత్నకుమారి తదితరులు ఉన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...