ఘనంగా బాబూ జగజ్జివన్ రావు వర్ధంతి
అనకాపల్లి
భీమునిగుమ్మం అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో 34వ బాబుజగజీవన్ రావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రత్నాకర్ గారు మాట్లాడుతూ బాబుజగ్జీవన్ రావు గొప్ప సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధులు , గొప్ప పార్లమెంట్రియన్గా జాతికి దేశానికి ఎంతో సేవ చేసారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ పట్టణాధ్యక్షులు జానకి జానికిరమరాజు , అరుంధతి సేవా సంఘం నాయకులు కట్టుమూరి మంగరాజు , మహాలక్ష్మినాయుడు ,జైభీమ్ సేన సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రేబాక మధుబాబు, నాయుడు , చెవ్వేటి చంటి, 80 వ వార్డు ఇన్చార్జ్ కొణతాల భాస్కరరావు 81 వ వార్డు రాంబాబు గారు, దళిత సంఘాల నాయకులు, వైస్సార్ పార్టీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం పేదలకు కాయగూరలు పంపిణీ చేశారు.
No comments:
Post a Comment