Followers

లాక్ డౌన్ ప్రకటించాలని టీడీపీ నాయకులు అధికారులకు వినతి





కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడం కోసం లాక్ డౌన్ ప్రకటించాలని టీడీపీ నాయకులు అధికారులకు వినతి.

 

గోకవరం పెన్ పవర్.

 

కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడం కోసం గోకవరం మండలం లో లాక్ డౌన్ ప్రకటించాలని మంగళవారం స్థానిక టిడిపి నాయకులు  మాజీ జెడ్పిటిసి పాలూరు బోసు బాబు, గునిపే. భరత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం బోసుబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కరోనా విలయ తాండవం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉందని అదేవిధంగా గోకవరం గ్రామములో ఇటీవల పాజిటివ్ కేసులు అధికంగా పెరిగి మరణాలు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామములో వారపు సంత, కిరాణా జనరల్ స్టోర్స్, కాయగూరలు మరియు ఇతర వ్యాపారస్తులు అధికంగా ఉండటం వల్ల చుట్టుపక్కల గ్రామాల వారు, ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారు రాజమహేంద్రవరం నుండి ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాలకు గోకవరం మీదుగా మార్గం ఉండటం వల్ల ప్రజలు రద్దీ విపరీతంగా పెరిగిపోవడం వలన కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని ప్రజలు మాస్క్లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా, ప్రజలు గుమిగూడి ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి అధికమవుతుందని ఆయన తెలిపారు. కాబట్టి అధికారులు గోకవరం గ్రామాన్ని 15 రోజులు లాక్డౌన్ ప్రకటించి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కల్పించి నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...