రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెన్ పవర్ ఉలవపాడు
ఉలవపాడు రైల్వే గేట్ నెంబర్ 175 వద్ద గూడ్స్ ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి......
ఉలవపాడు మండలం లోని చాగొల్లు చాకిచెర్ల రైల్వే గేట్ నెంబర్ 175 వద్ద మంగళవారం నాడు సాయంకాలం 6 గంటలకు చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న స్టీల్ సిటీ గూడ్స్ ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు అతని వయసు సుమారు 35 నుండి 40 ఉంటుంది గూడ్స్ డ్రైవర్ సమాచారం మేరకు ఉలవపాడు రైల్వే సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.
No comments:
Post a Comment