మండలంలో మరో కరోనా పాజిటివ్
జడ్డంగి ,పెన్ పవర్
మండలంలోని జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నాడు సంజీవిని వాహనం ద్వారా స్థానిక పీహెచ్సీ సిబ్బంది68 మందికి రాపిడ్ కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. మంగళవారం నాడు పాజిటివ్ వచ్చిన రాజవొమ్మంగి 99 బిల్డింగ్ నివాసులు ఇద్దరిని, ఫారెస్ట్ ఉద్యోగిని భార్య భర్తల ను రాజమండ్రి జి ఎస్ ఎల్ కు బుధవారం నాడు తరలించారు. స్థానిక ఏ పీ ఎఫ్ డి సి కార్యాలయంవద్ద,బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కార్యాల యం వద్ద, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వద్ద, కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటి వద్ద సోడియం హైపో క్లోర్తెడ్ ద్రావణం( ఎన్ఏ సి ఎల్ వో) పిచికారి తో పాటు బ్లీచింగ్ స్థానిక పంచాయతీ కార్యద మల్లేశ్వరరావు జల్లించారు. వారు నివాసం ఉంటున్న చుట్టుపక్కల ప్రదేశాల వద్ద పారిశుద్ధ్య పనులు చేయించారు.
No comments:
Post a Comment