Followers

గౌడ్ జాతికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి  


బీసీ లో అతిపెద్ద సామాజిక వర్గమైన గౌడ్ జాతికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి
 


ఆత్రేయపురం,పెన్ పవర్


మండలం ర్యాలీలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టా వీరబాబు మాట్లాడుతూ త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు ఇతను దివంగత నేత  వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా సన్నిహితంగా మెలిగే వారిని గతంలో  జోగి రమేష్ ఆర్టీసీ చైర్మన్ గా పని చేశారు2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో పెడన నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గత ప్రభుత్వం మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా గౌడ సామాజిక వర్గాన్ని వివక్షతకు గురి చేశారని ఆరోపించారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో గౌడ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం అవుతున్నది మన రాష్ట్రంలో బీసీల అతిపెద్ద సామాజిక వర్గమైన గౌడ్ కు అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వంలో అయినా జోగి రమేష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని ముఖ్యమంత్రి వై.ఎస్  జగన్ మోహన్ రెడ్డి ని కోరారు, కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం చేసిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని ప్రజలందరిని కోరుకుంటున్నాను.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...