రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా
పెన్ పవర్, ఉలవపాడు
ఉలవపాడు మండలంలో రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ అవుతుంది మండలంలో నాలుగు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని డాక్టర్ శ్రీనివాసులు శనివారం తెలిపారు. ఉలవపాడు పంచాయతీలోని హైస్కూల్ సంఘంలో 2, కృష్ణానగర్లో 1 , ఆత్మకూరు ఆది ఆంధ్ర కాలనీ లో 1 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉలవపాడు లో 70 మందికి మన్నేటికోట లో 30 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన ఈ నలుగురిని ఒంగోలు ఐసోలేషన్ కు తరలిస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంలు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment