Followers

హైరిస్క్‌ జోన్‌గా పాతూరు


హైరిస్క్‌ జోన్‌గా పాతూరు
పెద్ద బస్టాండ్‌ నుంచి చిన్న బస్టాండ్‌ వరకు సంపూర్ణం బంద్‌
మూడు రోజుల్లో 39 పాజిటివ్‌ కేసులు  నమోదు
అత్యధికం పాతూరులోని వ్యాపారవర్గా ప్రజలు 
వచ్చే శనివారం వరకు  నిబంధనలు  అమలు 
నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు  తప్పవు
తహశీల్దార్‌ జె ప్రభాకర్‌రావు
మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కుందురు
(పెన్‌పవర్‌, పొదిలి)
80 రోజల క్రితం వరకు పొదిలి పట్టణంలోని జిల్లా వ్యాప్తంగా కేసు వస్తున్నా ఇక్కడ మాత్రం కేసు లేకుండా అహర్నిశలు  భార్య, బిడ్డలను సైతం వదిలి మన ప్రాణాను కాపాడేందుకు పోలీసు, పంచాయతీ, వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ అధికాయి కృషి చేశారు. అయితే అనూహ్యంగా ప్రభుత్వాలు సడలింపు ఇవ్వడంతో ఒక్క సారిగా కేసులు  పెరుగుతూ వస్తున్నాయి. సడలింపు ఇచ్చినప్పటికీ నెల రోజులు  పాటు పోలీసులు  నిబంధనల పట్ల కొంత కఠినంగా ఉండడంతో కేసులు  నమోదు తక్కువగానే ఉన్నాయి. అయితే అనూహ్యంగా వారం రోజుల వ్యవధిలో పొదిలి పట్టణంలో సుమారు 40 కేసులు  నమోదు అయ్యాయి. దీంతో అధికారులు  ఒక్క సారిగా ఏం చేయాలో అర్థం కాక తలలు  పట్టుకున్నారు. ఓ వైపు పోలీసులు  ఎంత కఠినంగా వ్యవహహరిస్తున్నా వ్యాపారులు  మాత్రం తమ వ్యాపారాలను దొంగ దారిలో అయినా సరే నిర్వహిస్తు  వ్యాపారమే పరమావధిగా సాగించారు.  వ్యాపారులు  ధనార్జనే కేసులు  అధిక సంఖ్యలో నమోదుకు కారణంగా పోలీసులు , ఇతర శాఖ అధికారులు  దాదాపు నిర్ణయానికొచ్చారు. ఈ వారంలో గురువారం అత్యధికంగా తొలిసారిగా 16 పాజిటివ్‌ కేసులు  నమోదు అయ్యాయి. దీంతో అధికారులు  ఒక్క సారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఏం చేయాలని ఆలోచించి నిర్ణయం తీసుకునే లోపే శుక్రవారం, శనివారాల్లో 9, 14 కేసు నమోదు కావడం అధికారులను సైతం కవరపెట్టింది. దీంతో ఎలాగైనా కేసులను తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు  తీసుకోవాని అధికారులు నిర్ణయించారు. వెంటనే స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎంత కఠిన నిర్ణయాలు ఆయిన  తీసుకొని  కేసులను తగ్గించేందుకు చర్యలు  చేపట్టాని, అందుకు తన వంతు సహాయ, సహకారాలు  ఎళ్ళవేళలా ఉంటాయని ఎమ్మెల్యే అధికారులకు భరోసా కల్పించారు. దీంతో అధికారులు  ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. పొదిలి పెద్ద బస్టాండ్‌ నుంచి చిన్న బస్టాండ్‌ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. పెద్ద బస్టాండ్‌, చిన్న బస్టాండ్‌ సెంటర్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి పూర్తిగా దిగ్భంధించారు. పొదిలి ఎస్‌ఐ సురేష్‌ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆయన  ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆ ప్రాంతాన్ని తహశీల్దార్‌ జె ప్రభాకర్‌రావు, ఎస్‌ఐ ఇతర సిబ్బందితో కలిసి పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే శనివారం వరకు ఈ నిబంధనలు  ఉంటాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ బయటకు తిరగవద్దని హెచ్చరించారు. తమ ఉత్తర్వులను ఉలంఘిస్తే అవసరమైతే వారిపై కేసులు  నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమన్నారు. సోమవారం నుంచి రాబోయే శనివారం వరకు పట్టణంలోని రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయం, ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ఐసి కార్యాలయాలను కూడా మూసివేయించేందుకు అవసరమైన చర్యల తీసుకుంటున్నామన్నారు. అయితే పెద్దబస్టాండ్‌ వద్ద ఉన్న బ్రిడ్జి కింద నుంచి విశ్వనాధపురం ప్రాంతం వరకు నిత్యావసరాలు , కూరగాయలు , మెడికల్‌ షాపులకు మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంట వరకు అనుమతులు  ఇవ్వడం జరిగిందన్నారు. పొదిలి సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ వి శ్రీరామ్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సురేష్‌ ప్రత్యేకంగా తన సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతూరు లోని ఇండ్లలో నుంచి ఎవరు కూడా బయటకు రావద్దని పిలుపునిచ్చారు. ఎవరైనా సరే నిబంధనలు  అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మొత్తంగా పొదిలిలో మూడు రోజుల్లో సుమారు 40 కేసులు  రావడంతో అధికారులు  ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇప్పటికైనా ప్రజలు  అధికారుల  ఉత్తర్వులకు లోబడి నడుచుకోవాని వారు కోరుతున్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...