రహదారి పనులు పై నిరసన -మాజీ ఎమ్మెల్యే పెందుర్తి
పెన్ పవర్ ,సీతానగరం
మండల కేంద్రం నందు రహదారి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పత్రికా విలేఖరులతో పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నుంచి సీతానగరం వరకు గల జాతీయ రహదారిని తెలుగుదేశం హయామంలో ఆర్ అండ్ బి నుండి స్టేట్ హైవే గా మార్చి కాతేరు వరకూ పూర్తిచేసిన పనులను సీతానగరం వరకూ తక్షణమే పూర్తిచేయాలని ఈ నిరసన దీక్షను చేపట్టడం జరిగిందని అన్నారు. మండల ప్రజలు రాజమహేంద్రవరం డయాలసిస్ పేషెంట్స్, వృద్ధులు,వికలాంగులు పలువురు వైద్య సేవల నిమిత్తమై వెళ్లాలంటే రహదారి తూట్లు తూట్లు కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ నాయకులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఈ రోడ్డు దుస్థితి గమనించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ నాయకులను అధికారులను వెంకటేశ్ డిమాండ్ చేశారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన పెళ్ళికానుకను తమ ప్రభుత్వ పెళ్లి కానుకగా మార్చి సంవత్సర కాలం నుంచి ప్రజలకు ఎటువంటి న్యాయం జరగని దుస్థితి నెలకొందని అన్నారు. పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప పేదలకు పూర్తి న్యాయం జరగడం లేదని సూచించారు.నీట మునిగిన పంట పొలాల రైతులను ఆదుకుని ఆ రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. పేదలకు అందించే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ లోన్లు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని కరోనా మహమ్మారి తీవ్రంగా వృద్ధి చెందుతున్న సందర్భంలో సీతానగరం మండలంలో ప్రజా సమస్యలను తక్షణమే సేకరించేందుకు పోలీస్ స్టేషన్ నందు పర్మినెంట్ ఎస్సై లేకుండా ఇంచార్జ్ ఎస్ఐలతో నియోజకవర్గ పరిపాలన నడుస్తుందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న నాటుసారా వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వులవుల రాజా,కంటే వీరన్న చౌదరి,మింగి లక్ష్మీనారాయణ,పుక్కాల శ్రీను,అడబాల వీరబాబు,నాగా రమేష్, కొయ్య సామ్యేల్,పెందుర్తి రాజా,పోలిన కృష్ణ, గద్దే రసురేష్,మంచాల బాలాజీ,అఖిలపక్ష రైతు సమన్వయ కర్త కడపా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment