మన్యానికి చేరిన సంజీవిని వాహనం.
విశాఖపట్నం _బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
కోవిడ్19 పరీక్షలకోసం పాటు చేసిన సంజీవిని వాహనం సోమవారం మన్యానికి చేరుకుంది. కరోనా వైరస్ గుర్తించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంజీవిని బస్సుని అధికారులు ఏజెన్సీకి కేటాయించారు. ఏజెన్సీ 11 మండలాల్లో కరోనా వైరస్ పలుచోట్ల బయటపడ్డాయి. గిరిజన ప్రాంతం కావడం వల్ల రవాణా సౌకర్యం లేని గ్రామాలకు కరోనా పరీక్షలు అందించాలని జిల్లా కలెక్టర్ ఏజెన్సీకి సంజీవని బస్సును తరలించారు. ఈ వాహనం ఏజెన్సీలోని అన్ని గ్రామాల ప్రజలకు పరీక్షలు చేసి కరోనా వైరస్ గుర్తిస్తారు. అనుమానం ఉన్న గిరిజనులు సంజీవిని బస్సులో వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
No comments:
Post a Comment