గోకవరం నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
గోకవరం పెన్ పవర్.
గోకవరం మండల నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం జరిగింది. గోకవరంలో జరిగిన సంఘం సమావేశంలో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షులుగా సానాపల్లి బాపిరాజు, సూదికొండ కుమార్, వల్లూరి నాగేశ్వరరావు, గండ్రెడ్డి నాని, సేనాపల్లి బాబులు, మల్లువలస సుబ్బారావు, అధ్యక్షునిగా సునయిల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షునిగా మల్లువలస రామరాజు, సెక్రటరీగా మల్లువలస రాంబాబు, జాయింట్ సెక్రటరీగా వల్లూరి ప్రసాద్, కోశాధికారిగా గండ్రెడ్డి సుబ్రహ్మణ్యం, జాయింట్ కోశాధికారిగా కొండపల్లి వీరబ్రహ్మం, సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సంఘం నూతన కార్యవర్గం సభ్యులను వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్, నాయకులు దాసరి రమేష్, కర్రి సూరారెడ్డి, సుంకర వెంకటరమణలు అభినందించారు.
No comments:
Post a Comment