ఆశా వర్కర్ల ఏఎన్ఎంలకు సరుకులు అందజేత
అనకాపల్లి , పెన్ పవర్
దివంగతనేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 71వ జయంతోత్సవాలలో భాగంగా జీవీఎంసీ 80వ వార్డ్ పరిధిలో ఉన్నా ఆశ వర్కర్లకు, ఏ.ఎన్.ఎమ్ లకు, ఆర్.పి లకు వైస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ చేతుల మీదుగా 80వ వార్డ్ వైస్సార్సీపీ నాయకులు కొణతాల భాస్కరరావు,వైస్సార్సీపీ 80వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిని నీలిమల ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, కిరాణా సరుకులు,కాయకూరలను అందజేశారు.ఈ సందర్బంగా రత్నాకర్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ముందుండే భాస్కర్,నీలిమలు ఈ కరోనా విపత్తు సమయంలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఆర్.పి లను, ఏ.ఎన్.ఎమ్ లను,ఆశ వర్కర్లను గుర్తించి వారికి తనవంతు సేవ చేయటం అభినందించదగ్గ విషయమన్నారు.ఈ సందర్బంగా అక్కడికి వచ్చిన ఆర్.పి లు తమకు గత 13 సంవత్సరాలనుంచి జీతభత్యాలు లేవని ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని సమస్యను ఇంతవరకు ఎంతో మంది నాయకులకు తెలియజేసిన మా సమస్యను పరిష్కరించలేదని రత్నాకర్ దృష్టికి తీసుకురాగా అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన సమస్య పరిస్కారమయ్యేలా చేస్తానని ఆర్.పి లకు తెలిపారు.ఆర్.పి లు రత్నాకర్ గారి సేవానిరతిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాండ్రేగుల శ్రీరామ్,విల్లూరి శేఖర్,విల్లూరి సంతోష్,సూరిశెట్టి గిరి, కొణతాల చందు,పెంటకోట సునీల్, బి.వరకుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment