*పాలకుర్తి సురేష్ ఆధ్వర్యంలో ప్రతి వారం జగ్గంపేటలో శానిటేషన్ పిచికారి*
జగ్గంపేట,పెన్ పవర్
జగ్గంపేట చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పాలకుర్తి సురేష్ ఆధ్వర్యంలో కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు తన వంతు ప్రయత్నంగా ప్రతి వారం వ్యక్తిగత నిధులతో జగ్గంపేట లోని మెయిన్ రోడ్, షాపింగ్ కాంప్లెక్స్ లో, సర్వీస్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ వివిధ ముఖ్యమైన కార్యాలయాల వద్ద సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు సోమవారం ఉదయం పాలకుర్తి సురేష్ పర్యవేక్షణలో స్ప్రేయింగ్ మిషన్ ద్వారా శానిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న క రోనా మహమ్మారి బారిని కాపాడుకునేందుకు మన పరిసరాల పరిశుభ్రత కొరకు ఈ శానిటేషన్ ప్రతివారం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని వ్యాపార దుకాణాలు నిర్వహించేవారు, పనిచేసేవారు, కొనుగోలుదారులు ప్రతి ఒక్కరు కూడా విధిగా మాస్కులు ధరించి, చేతులు శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలని కోరారు. ఈ శానిటేషన్ పక్రియ కొన్ని నెలల పాటు కొనసాగించడం జరుగుతుందన్నారు.
No comments:
Post a Comment