మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడ పత్రికలు
చింతపల్లి జూలై 20 పెన్ పవర్
చింతపల్లి ఏజెన్సీలో సిపిఐ మావోయిస్టులకు వ్యతిరేకంగా అల్లూరి గిరిజన సేవా సంఘం పేరుతో గోడ పత్రికలు వెలిశాయి. మండలంలోని అన్నవరం, చౌడుపల్లి గ్రామ పరిసరాలలోనూ, స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనియన్ బ్యాంక్, హనుమాన్ జంక్షన్, తదితర ప్రాంతాల్లో గోడ పత్రికలు వెలిశాయి. ఆ గోడ పత్రికల్లో జైల్లో వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో కలవరపడుతున్న కుటుంబ సభ్యులు.... వారికి మద్దతు పలుకుతున్న మావోయిస్టు ముసుగు సంఘాలు... వరవరరావు వారి కుటుంబ సభ్యులే మనుషులా? వారి ప్రాణాలే గొప్పవా? మానవ హక్కుల సంఘాలమని చెప్పుకునే మావోయిస్టు ముసుగు సంఘ సభ్యులారా... ఏంటి ద్వంద్వ ప్రమాణాలు? ఎన్నాళ్ళీ మావోయిస్టుల మారణహోమాలు? మరి ఎంతో మంది మా గిరిజనులను కిరాతకంగా చంపి కొన్ని వేల గిరిజన కుటుంబాల్ని బుగ్గిపాలు చేస్తున్నారు. మావోయిస్టులారా... వారి ఆర్తనాదాలు మీకు వినిపించవా? కనిపించవా? మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన మా గిరిజనులు, వారి కుటుంబ సభ్యులు మనుషులు కాదా? వారి ప్రాణాలకు విలువ లేదా? అని అల్లూరి గిరిజన సేవా సంఘం పేరుతో గోడ పత్రికలు వెలిశాయి. ఈ నెల 13న, ఆదివాసి విప్లవ ఐక్య సంఘటన--- తూర్పు విశాఖ జిల్లాల సంయుక్త కమిటీ కార్యదర్శి విజయ్ పేరుతో పత్రికా ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ గోడ పత్రికలు వెలిసాయని పలువురు గుసగుసలాడు కుంటున్నారు.ఈ గోడ పత్రికలు చూసిన గిరిజనులు ఆసక్తిగా తిలకిస్తూ! ఆలోచిస్తున్నారు.

No comments:
Post a Comment