Followers

సింహాచలం దేవస్థానం వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన


సింహాచలం  దేవస్థానంలో సంచలన నిర్ణయం
140 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు
ఆర్థిక భారం వల్లే  తొలగించా మంటున్న దేవస్థానం.
కరోనా సమయంలోతొలగించడంపై ఉద్యోగుల నిరసన
            
            విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



సింహాచలం దేవస్థానం సంచలన నిర్ణయం  తీసుకుంది. దేవస్థానంలో పనిచేస్తున్న సెక్యూరిటీ  కాంట్రాక్ట్  అవుట్సోర్సింగ్  ఉద్యోగులను మూకుమ్మడిగా తొలగించింది. 140 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్  సెక్యూరిటీ సిబ్బందిని  విధుల నుంచి తొలగిస్తున్నట్లు  దేవస్థానం ప్రకటించింది. కరోనా లాక్డౌన్ కారణంగా  ఆలయానికి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోవడంతో  ఈ చర్యలు  తీసుకున్నట్లు దేవస్థానం పేర్కొంటుంది. దేవస్థానం పరిధిలో  నాలుగు కోట్ల వరకు ఆదాయం వచ్చేది ప్రస్తుతం ఈ ఆదాయం 20 లక్షల రూపాయలకు  పడిపోవడంతో  ఆలయ నిర్వహణ భారంగా మారిపోయింది. ఈ కష్టకాలంలో  ఆలయంలో ఖర్చులు తగ్గించుకోవాలని  దేవస్థానం నిర్ణయించుకుంది  ఈ నేపథ్యంలో  సెక్యూరిటీ   కాంట్రాక్ట్  అవుట్సోర్సింగ్  ఉద్యోగులను  తొలగించాలని భావించింది.  140 మంది కార్మికులు తొలగించడం వల్ల  దేవస్థానానికి  ఊరట కలుగుతుందని భావించారు. సెక్యూరిటీ  కాంట్రాక్ట్  అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో  సిబ్బంది ఆందోళన సిద్ధమవుతున్నారు. కరోనా కష్టకాలంలో లో తమని తొలగిస్తే రోడ్డున పడతామని కార్మికులు ఆన్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం నిరసనలకు పిలుపునిస్తున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవస్థానం మాజీ  ట్రస్ట్  సభ్యులు పాసర్ల ప్రసాద్  మాట్లాడుతూ హిందూ దేవాలయాల నుంచి 20 శాతం కార్పస్ ఫండ్ వసూలు చేస్తున్న  ప్రభుత్వం ఈ అవుట్ సోర్సింగ్  ఉద్యోగులను ఆదుకోవాలని ఆయన కోరారు.


 

 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...