ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
తాళ్ళపూడి, పెన్ పవర్:
తాళ్ళపూడిలో బుధవారం నాడు దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తాళ్ళపూడి లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న వై.యస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి తాళ్ళపూడి వైయస్సార్సీపీ నాయకులు అందరూ పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు గుర్తుకు తెచ్చుకోవడం, జోహార్లు రాజశేఖర్ రెడ్డి అని నినాదాలు తెలిపారు. ఆయన పాలనలో ఆంద్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం అని తాళ్ళపూడి వైయస్సార్సీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ సీనియర్ బి.సి. నాయకులు నక్కా చిట్టిబాబు, వైయస్సార్సీపీ నాయకులు సిరిపురపు మదన్ మోహన్ రెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షులు ఒంబోలు పోసిబాబు, వైయస్సార్సీపీ నాయకులు బండ్రెడ్డి వెంకటేశ్వరరావు, సిద్దంశెట్టి కృష్ణ, బండారు నాగేశ్వరరావు, గూడా విజయ రాజు, మైగాపుల ఆంజనేయులు, బండ్రెడ్డి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment