Followers

చక్కా కేశవ కి రివార్డు అందజేసిన రూరల్ ఎస్సై అంకమ్మ



చక్కా కేశవ కి రివార్డు అందజేసిన రూరల్ ఎస్సై అంకమ్మ  

 

 (కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి, పెన్ పవర్) 

 

 కొత్తూరి కాశీలక్షమ్మ  ఒంగోలు రిమ్స్ లో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆమె అడ్రస్ పోలీసు వారికి తెలియకపోవడంతో.కందుకూరు రూరల్ ఎస్సై కొత్తపల్లి అంకమ్మ ఈ మహిళ అడ్రస్ తెలిపిన వారికి 1000 రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని కందుకూరు వాట్సప్ గ్రూపుల లో ప్రకటించారు.దీనికి స్పందించిన ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకట కేశవరావు ఆమె పామూరు కు చెందినదని, వారి కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ నెంబర్ సేకరించి రూరల్ ఎస్సై అంకమ్మ కు  వివరాలు అందజేశారు. శనివారం సాయంత్రం చక్కా వెంకట కేశవరావు కు  అంకమ్మ తన చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అంకమ్మ మాట్లాడుతూ ఒంగోలు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమె వివరాలు తెలియక పోలీసువారు ఇబ్బంది పడుతున్న సమయంలో మాకు ఆమె వివరాలు తెలియ జేసిన కేశవరావు గారికి ధన్యవాదాలు తెలిపారు. చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ తనకు ఇచ్చిన రివార్డుకు కొంత నగదును కలిపి ఒక పేదవానికి వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై  అంకమ్మ చేతులమీదుగా ఆదివారం అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వెంకట కేశవరావు కు అభినందనలు తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...