అధికారులు అప్రమత్తంగా ఉండాలి: పెద్దాపురం ఆర్డీవో
ఏలేశ్వరం,
ఏలేశ్వరం నగర పంచాయితీ, మండలం పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏలేశ్వరం లోని లింగవరం కాలనీ, వాగు వారి వీధి, పాత ఎస్ సి బాయ్స్ హాస్టల్, లింగంపర్తి గ్రామాల్లోని కంటోన్మెంట్ జోన్లను ఆయన పర్యటించారు. అనంతరం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో అధికారులతో చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దగ్గు ఆయాసం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కోవిడ్- 19, పరీక్షలు చేయించుకొనెలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి ఎ.శ్రీనివాసరావు, ప్రత్తిపాడు సిఐ వై రాంబాబు, తహసిల్దార్ ఎం. రజినికుమారి, కమిషనర్ జి. కృష్ణ మోహన్, ఎంపీడీవో డిఎన్. రత్నకుమారి ఉన్నారు.
No comments:
Post a Comment