మద్యం వద్దు_ కుటుంబం ముద్దు
ప్రజా చైతన్యానికి తెరతీసిన ప్రభుత్వం.
గోడ పత్రికలు ఆవిష్కరించిన విశాఖ అరకు ఎంపీలు.
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
ప్రజా చైతన్యంలో భాగంగా మద్యం వద్దు కుటుంబం ముద్దు నినాదంతో గోడ పత్రికను విశాఖ ఎంపీ సత్యనారాయణ అరకు ఎంపీ గొట్టేటి మాధవి వారం విశాఖ లో ఆవిష్కరించారు. ఆంధ్ర ప్రదేశ్ మధ్య విమోచన ప్రచారం లో భాగంగా ఈ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు సత్యనారాయణ మాధవిలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంపూర్ణ మద్య నిషేధం మొదటి దశ విజయవంతం అయ్యిందని రెండో విడతలో ప్రజల్లో మద్యంపై అవగాహన కల్పించాలని మద్యం వద్దు కుటుంబం ముద్దు అనే నినాదంతో ప్రచారం చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల ప్రయోజనం కోసం సీఎం సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా ఉన్న లైసెన్స్ మద్యం దుకాణాలను కుదించి ప్రభుత్వ ఆధీనంలో 75% ధరలు పెంచి మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెరిగిన ధరలు తగిన బ్రాండ్లు లభించక మందు బాబులు సంఖ్య తగ్గిందన్నారు. మద్యం షాపులపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతూనే ఉందని అలాగే సంపూర్ణ మద్య నిషేధానికి ప్రజా చైతన్యం తీసుకురావాలని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు ఆంధ్ర ప్రదేశ్ మధ్య విమోచన కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ప్రచారాలు జరుగుతాయన్నారు. మద్యం మత్తు వల్ల కలిగే అనర్థాలను కళ్ళకు కట్టినట్లు ప్రజలకు వివరించాలని గోడ పత్రికలు ప్రచారాలు మొదలయ్యాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఏ ఏ సి రాష్ట్ర ఇంచార్జ్ సురేష్ బేతా పాల్గొన్నారు.
No comments:
Post a Comment