గాయాలైన మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన
వైద్య సేవలు అందిస్తాం. పాడేరు డిఎస్పి రాజ్ కమల్
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
గాయాలపాలైన మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్య సేవలు అందచేస్తామని పాడేరు డి.ఎస్.పి రాజ్ కమల్ అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ పెదబయలు మండలం లుంగడూరు ఈ ప్రాంతంలో ఆదివారం పది గంటల ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు ఈ సంఘటనలో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు అక్కడ పరిస్థితుల బట్టి తెలుస్తుందని అన్నారు. గాయాలపాలైన మావోయిస్టులకు వైద్యం అందక మీమాంస లో పడ్డారని తెలుస్తుందని ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్య సేవలు అందించటానికి విశాఖ పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. సంఘటనా స్థలంలో 5 కిట్ బ్యాగులు ఒక రైఫిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మావోయిస్టులు విధ్వంసకర సంఘటన పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో జనావాసాల్లోకి వచ్చేది లేదని పోలీసులతో తలపడ బొమ్మని పోలీసులను ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఇటీవల ఒడిశా ఎదురుకాల్పులు తర్వాత విశాఖ మన్యంలో కూడా మావోయిస్టులు ఎదురు కాల్పులకు తెగ పడ్డారని డి.ఎస్.పి రాజ్ కమల్ అన్నారు.
No comments:
Post a Comment