Followers

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో పలువురి అరెస్టు


స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో పలువురి అరెస్టు , సారా ద్విచక్ర వాహనాలు స్వాధీనం.


గోకవరం పెన్ పవర్.


తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ మరియు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ పరిధిలో జరిగిన దాడుల్లో మూడు కేసులు నమోదు చేసి 70 లీటర్ల సారాను ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందని కోరుకొండ  ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సీఐ కె .వీరబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం జరిగిన దాడుల్లో కోరుకొండ మండలం కోరుకొండ గ్రామానికి చెందిన కోట శివ గంగాధర్, కోటి కేశవరం గ్రామానికి చెందిన జల్లూరి రాజ్ కుమార్, గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన  గుర్రాల చిన బాబు,నూతాటి శ్రీను లను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచగా 3వ తేదీ వరకు వాళ్లకు రిమాండ్ విధించడం జరిగింది అని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందు వలన గ్రామాలలో సారా అమ్మకాలు వలన తాగడం వలన కరోనా వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాబట్టి సారా అమ్మకాలు అనధికారిక మద్యం విక్రయాలు ఏమైనా జరిగితే తమకు తెలియజేయవలసిందిగా కోరారు. సమాచారం ఇచ్చేవారు వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...