Followers

మాడుగుల లో కరోనా లక్షణాలతో మహిళ మృతి

మాడుగుల లో కరోనా లక్షణాలతో మహిళ మృతి


దహన సంస్కారం చేసిన పంచాయతీ సిబ్బంది

వి.మాడుగుల (పెన్ పవర్)


వి.మాడుగుల మేజర్ పంచాయతీ మాడుగుల గ్రామంలో గురువారం రాత్రి కోవిడ్19 లక్షణాలతో మహిళ మృతి చెందింది. స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న 53 ఏళ్ల మహిళ కరోనా లక్షణాలతో చనిపోయింది. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉండటంతో అంబులెన్స్ లో  విశాఖపట్నం తరలించే ప్రయత్నం చేశారు. ఈ లోగా ఆమె మృతి చెందింది. ఇటీవల ఆమెను పలుమార్లు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. మృతి చెందే సమయానికి మహిళకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది. శాంపిల్స్ను పరీక్షలకు పంపించారు. ఈ పరిస్థితి తెలియడంతో శవాన్ని ఎవరో తాకలేదు. పంచాయతీ సిబ్బంది తోపుడు బండి పై తరలించి దహన సంస్కారాలు చేశారు. మృతురాలు ఇంటి పరిసరాలు పారిశుద్ధ్యం శానిటేషన్ చేయిస్తున్నారు. రాజ వీధిలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈమెతో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. కార్యాలయంలో ఉద్యోగులకు  టీ  టిఫిన్లు  కోసం ఆమె దుకాణాల చుట్టూ తిరిగేది.  ఆమెను ఆసుపత్రికి తరలించిన వారు  కార్యాలయంలో సిబ్బంది పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పారిశుద్ధ్యం శానిటేషన్ అధికారులు చేపడుతున్నారు. గ్రామంలో ఇది మొట్టమొదటి కేస్ కావడం విశేషం.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...