విశాఖ సెంట్రల్ జైల్ కు ఎల్జి పాలిమర్స్ నిందితులు
గ్యాస్ లీక్ ఘటనలో ఎండి జియాంగ్ తో 12 మంది అరెస్టు
జూలై 22 వరకు రిమాండ్ విధించిన జిల్లామెజిస్ట్రేట్
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
విశాఖ ఎల్జి పాలిమర్స్ ఘటనలో అరెస్టు చేసిన 12 మంది నిందితులకు ఈనెల 22 తేదీ వరకు రిమాండ్ విధించారు. బుధవారం నిందితులను జూమ్ యాప్ ద్వారా మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచగా నిందితులకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అనంతరం 12 మంది నిందితులను విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. ఎల్జి పాలిమర్స్ లో మే 7న స్టెరైన్ గ్యాస్ లీక్ జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో జనం ఏంటి లెటర్ కు బలయ్యారు. సంఘటనపై విచారణ జరపాలని ప్రభుత్వం హైపర్ కమిటీని నియమించింది. సంఘటనపై హైపర్ కమిటీ రిపోర్టును 2 రోజుల క్రితం ప్రభుత్వానికి సమర్పించింది. రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. విశాఖ పర్యావరణ ఇంజనీర్లు పి. ప్రసాదరావు ఆర్. లక్ష్మీనారాయణ లను సస్పెండ్ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. విశాఖ డిప్యూటీ చీఫ్ ఇంచార్జ్ ఆప్ పొల్యూషన్ జేబీఎస్ రాజును సస్పెండ్ చేస్తూ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ దాడి చేసింది. ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ కి ప్రధాన కారణమైన 12 మంది ఉద్యోగులను అరెస్టు చేశారు. ఎల్జి పాలిమర్స్ సీఈవో మేనేజింగ్ డైరెక్టర్ సుంకే జియాంగ్ టెక్నీషియన్ డైరెక్టర్ డి ఎస్ కిమ్ మరో పది మంది ఉద్యోగులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా తెలిపారు. ఫ్యాక్టరీ పై ప్రభుత్వం కఠినంగా చర్యలు చేపడుతుందని స్పష్టమవుతుంది.
No comments:
Post a Comment