Followers

ప్రశాంత మన్యంలో మారుమ్రోగిన తుపాకుల మోత


 


ప్రశాంత మన్యంలో మారుమ్రోగిన తుపాకుల మోత.


భయం గుప్పెట్లో మన్యం.


 


  విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



   కరోనా నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న  విశాఖ మన్యంలో మళ్లీ తుపాకీ తోటలు  మారుమ్రోగాయి. ఆదివారం మావోయిస్టు పోలీసులు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో  మావోయిస్టులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.  పాడేరు డివిజన్  పెదబయలు మండలం లుంగుడేరు    అడవి ప్రాంతంలో  మావోయిస్టుల  కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో  పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసులు మావోయిస్టులు తార్స పడడంతో ఎదురుకాల్పులు జరిగాయి ఈ సంఘటనలో   మరణాలు  తలెత్తగా పోయినా పలువురు మావోయిస్టులకు  గాయాలైనట్లు సమాచారం.  మావోయిస్టులు  తప్పించుకున్నారు.  గత కొంత కాలంగా విశాఖ మన్యం మావోయిస్టుల విధ్వంసకర సంఘటనలకు దూరంగా ఉంది. పోలీసులు కరోనా నిబంధనల  చర్యల వైపు  నిమగ్నమయ్యారు. విశాఖ మన్యం ప్రశాంతంగా ఉంది. ఈ క్షణంలో సడన్ గా మావోయిస్టులు  పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరగడంతో  మన్యం ఉలిక్కిపడింది.ప్రతీకార చర్యలు కోసం  ఎక్కడ ఎటువంటి విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకుంటాయని  గిరిజనం  ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...