పాస్టర్లు అందరూ ఐక్యమత్యంతో ఉండాలి
రాయవరం పెన్ పవర్
ఈరోజు మండల కేంద్రం రాయవరం లో తమలపూడి గంగాధర్ రెడ్డి ఆఫీస్ నందు మంతెన అచ్యుత రామరాజు, గంగాధర్ రెడ్డి, బొడ్డు శ్రీను సమక్షంలో రాయవరం మండలం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్.డా. పలివెల ప్రసాద్ తన కమిటీ సభ్యులతో సహా మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు: రెవ.కొమ్ము సోమశేఖర్, బక్కి సత్య దాస్, తాతపూడి నతానియేలు సమక్షంలో రెండు కమిటీలు ఒకటిగా చేసియున్నారు ప్రసాద్, సోమశేఖర్ మాట్లాడుతూ రాయవరం మండలం లో ఉన్న పాస్టర్లు అందరూ ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు ఇక్కడ నుండి రాయవరం మండలం లో పాస్టర్స్ ఫెలోషిప్ ఒకటే ఉంటుందని నిర్ధారించారు ఈ కార్యక్రమంలో ఐ. ప్రభుదాస్, బక్కీ ప్రాన్సిస్, వైరాల పోతాను బాబు, విలియం కేరి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment